మళ్ళీ తన జోనర్లోకి వచ్చిన కళ్యాణ్ రామ్

ఇప్పుడు మళ్లీ తనదైన జోనర్ లో 118 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలయింది. హాయిగా సాగిపోయే జీవితంలో కుదుపు. ఆపై హీరో ఆ సమస్య నుంచి బయటకు రావడానికి చేసే ప్రయత్నం అన్నది టీజర్ లో కనిపించిన కాన్సెప్ట్. సినిమాటోగ్రాఫర్ గా పేరున్న గుహాన్ ఇప్పుడు డైరక్టర్ గా మారారు. అందువల్ల టేకింగ్ లో వైవిధ్యం, రిచ్ నెస్ కనిపిస్తున్నాయి.

టీజర్ లో చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే, కళ్యాణ్ రామ్ గెటప్, స్టయిల్ టెంపర్ లో ఎన్టీఆర్ లుక్స్ లో వుండడం. టీజర్ విడుదల సందర్భంగా వదిలిన స్టిల్ కూడా ఎన్టీఆర్ లుక్స్ స్టయిల్ లో వుండడం విశేషం.

Share this article: